హుజూర్‌నగర్‌లో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి మాట్లాడుతూ, హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా మహనీయుల సేవలను గుర్తించడం గొప్ప విషయమని, విమర్శలను లెక్కచేయకుండా ముందుకు సాగడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, సాంబా రామయ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.