అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహార సేవలు అందించడానికి అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్