హుజూర్ నగర్ లో గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు కిలోన్నర గంజాయి, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్