ఈ నెల 17న హుజూర్ నగర్ లో అదనపు కోర్టు ప్రారంభం

హుజూర్ నగర్ కు నూతనంగా మంజూరైన మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఈనెల 17న గురువారం ఉదయం 10 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధా రాణి వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు వినోద్ కుమార్, లక్ష్మణ్, సుజన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్యామ్ శ్రీ హాజరు కానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్