భూ సమస్యల సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం గరిడే పల్లి మండలం వెలిదండలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్, రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.