హుజూర్ నగర్: హిందూ దేవుళ్ల వ్యాఖ్యల పై ఆందోళన

హుజూర్ నగర్ లో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడానికి వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్