హుజూర్ నగర్: లింగగిరి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

హుజూర్ నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ అధ్వర్యంలో గురువారం క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి సోకిన రోగులకు ప్రభుత్వం మందులు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. క్షయ రోగి నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పద్మ, నూర్జహాన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్