జనాభా పెరుగుదలను అరికట్టాలని హుజూర్ నగర్ మండలం లింగగిరి పిహెచ్సీ డాక్టర్ వేణుగోపాల్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. జనాభా పెరుగుదలను అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్లు నూర్జహాన్ బేగం, నర్సింగ్ ఆఫీసర్ రత్నమేరీ ఉన్నారు.