ఆర్టీసీ సంస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు సమాజంలో అందరి సహకారం కావాలని కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాస రావు అన్నారు. శనివారం హుజూర్నగర్ ఆర్టీసీ లాజిస్టిక్ పాయింట్ సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ భద్రాచల రాములవారి కళ్యాణ తలంబ్రాలు 101 మంది చే బుకింగ్ చేయించిన ఆర్టీసీ రిటైర్డ్ ఎడిసి రామలింగం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్గో సర్వీస్ ఏజెంట్ వెంకన్న ఉన్నారు.