హుజూర్‌నగర్: వందరోజుల ప్రణాళికలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు ఎన్జీవోస్ కాలనీ, గణేష్ నగర్ లలో వందరోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. నివాసాల మధ్య ఖాళీ ప్రదేశాల్లో ఉన్న పిచ్చి చెట్లను తొలగించారు. డ్రైనేజీలను వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతిసంపత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, వార్డు అధికారి అశోక్ జవాన్ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్