తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురంలో నుండి ప్రారంభించే యువగళం సైకిల్ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.