నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది: మంత్రి కోమటిరెడ్డి

మహిళా అధికారులపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనపై ఏమైనా రాసినా తట్టుకుంటానని, కానీ మహిళా ఐఏఎస్ అధికారులపై ఇష్టానుసారంగా వార్తలు రాయకండని మీడియాను ఆయన అభ్యర్థించారు. అధికారులను బదిలీ చేసే హక్కు ముఖ్యమంత్రికే ఉంటుందని స్పష్టం చేశారు. తన కుమారుడిని కోల్పోయిన తర్వాత ప్రజాసేవ కోసం ఫౌండేషన్ నిర్వహిస్తున్నానని తెలిపారు. తప్పుడు రాతల వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తన కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని అన్నారు. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్