సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడు లాల్ తండాకు చెందిన తల్లూరి జయమ్మ ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు దెబ్బతినడంతో ఆమె నిరాశ్రయురాలైంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి, బాధిత మహిళ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, ప్రభుత్వ విపత్తు సహాయ నిబంధనల ప్రకారం తక్షణమే ఇంటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజలు కష్టకాలంలో ప్రభుత్వమే అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.