నేడు కోదాడకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాక

కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో ఆదివారం మధ్యాహ్నం 2. 30 గంటలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొంటారు. ఓటరు జాబితాల సవరణ, నమోదు, పరిశీలన వంటి అంశాలపై తెలంగాణ పీసీసీ నియమించిన శిక్షకులు శిక్షణ ఇస్తారు.

సంబంధిత పోస్ట్