నూతనకల్: కుటుంబ సమస్యలతో వ్యక్తి మృతి

నూతనకల్ మండలంలోని అల్గునూరులో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన యువకుడు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బంటు సైదులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆర్థిక భారం, కుటుంబ కలహాలతో గురువారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుమందు తాగి బంధువులకు సమాచారం ఇచ్చాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్