క్యాట్ ఒలంపియాడ్ లో అత్యుత్తమ ప్రతిభ

హుజూర్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు క్యాట్ ఒలంపియాడ్ లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు శనివారం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను అభినందించారు. సెకండ్ లెవెల్ లో పాల్గొన్న నలుగురు విద్యార్థులు మ్యాట్ లో నాలుగు క్యాష్ అవార్డులు, చాట్ లో ఒక క్యాష్ అవార్డును గెలుచుకున్నారు. వీరితో పాటు 33 మంది మెడల్స్ మెరిట్ సర్టిఫికెట్లను, మరో ముగ్గురు మెరిట్ సర్టిఫికెట్లను పొందారు. ఈ పోటీలు విద్యార్థులను కింది తరగతుల నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి దోహదపడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్