మట్టపల్లికి ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నుండి మట్టపల్లికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్‌లపై వెళ్లడానికి పెట్రోల్ లభించడం లేదు, ఆటోలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు కల్పించడంలో దేవస్థానం పాలకవర్గం విఫలమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్