హుజూర్‌నగర్ పరిధిలోని సబ్ సెంటర్–3లో జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరిగింది. 19వ వార్డు కౌన్సిలర్ వల్లపు దాసు కృష్ణ, స్థానిక నాయకులు షేక్ సైదా మేస్త్రి, షేక్ ముస్తఫా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కృష్ణ కోరారు. వైద్య సిబ్బంది సుజాత, నిర్మల, సుశీల పర్యవేక్షించారు. స్థానికులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.