హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం జడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం ఎంఈఓ నారపరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్-14, అండర్-17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎంపీడీవో ఆండాలు, ఎస్‌ఐ పరమేష్, ఎంపీఓ భూపాల్‌రెడ్డి, సర్పంచ్ రామ్ కోటిరెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోర్తల సీతారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి సుందరమౌలేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.