ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పరిశీలన

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూత్ నంబర్–225లో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఈ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించామని, అధికారులు చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్