దీపావళి మందుల తయారీ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి డిమాండ్ చేశారు. బుధవారం హుజూర్ నగర్ లో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన, వేట్లపాలెం సమీపంలోని సూర్య శ్రీ ఫైర్‌వర్క్స్‌లో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.