ఉపాధ్యాయుల వేషధారణ ఆదర్శంగా ఉండాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా మర్యాదపూర్వక దుస్తులతో హాజరుకావాలని విద్యాశాఖ అధికారి చత్రు నాయక్ ఆదివారం  ఆదేశించారు. టీ-షర్టులు, జీన్స్, టోపీలు వంటి క్యాజువల్ దుస్తులు ధరించరాదని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరలోనే విధులు నిర్వహించాలని తెలిపారు. ఉపాధ్యాయుల వేషధారణ విద్యార్థులపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, పాఠశాలల్లో క్రమశిక్షణ, సంస్కృతి, వృత్తి గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యమని వివరించారు.

సంబంధిత పోస్ట్