ముసాయిదా ఎన్నికల జాబితా సరి చూసుకోవాలి

హుజూర్ నగర్ లో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఎన్నికల జాబితాను శుక్రవారం డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ పరిశీలించారు. అన్ని వార్డుల ఓటర్లు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని, ఏవైనా సవరణలు, మార్పులు చేర్పులు ఉంటే కమిషనర్ కు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. జాబితాలు కార్యాలయంలో అధికారులచే ప్రదర్శించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్