సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన తోడేటి లక్ష్మి (సుమారు 50 సంవత్సరాలు) జూన్ 24 ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె భక్తురాలు కావడంతో దేవాలయాలు, ఆశ్రమాలు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 75693 58321, 70953 49479 లేదా 82474 55197 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.