మేళ్లచెరువు మండల విద్యాధికారి కాకుమాను వెంకటరెడ్డి విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషిని పిఆర్టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారం మేళ్లచెరువులో ఉద్యోగ విరమణ పొందిన వెంకటరెడ్డికి అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, వెంకటరెడ్డి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, ఎంఈఓ సలీం షరీఫ్, పలు మండలాల బాధ్యులు పాల్గొన్నారు.