శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో 203 వ అన్నప్రసాద వితరణ

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 5వ సంవత్సరం తొలి మంగళవారం సందర్భంగా 203వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కీ.శే. ఓరుగంటి స్వర్ణలత గారి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీ ఓరుగంటి కృష్ణమూర్తి గారు మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 450 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, లక్ష్మారెడ్డి నాగరాజు, లాస్యచరిత, సెక్రటరీ తిరుపతయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్