సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 216వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్త సుధారాణి కృష్ణచైతన్య సాహితీ నాగరాజు లాస్యచరిత మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 330 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, ఆకుల పుల్లారావు, సెక్రటరీ తిరుపతయ్య, వీ రామారావు, పెద్ది శేషు, ఉమామహేశ్వర్రావు, శిరీష, ఆర్జే రవీంద్ర, లక్ష్మయ్య, బిఎల్ఎన్ రెడ్డి, అర్చకులు విశాల్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.