కోదాడ పట్టణంలో ఈ నెల 17న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఘర్షణ ఘటనపై పోలీసులు భౌతిక దాడి కేసు నమోదు చేసి 10 మంది నిందితులను విచారించారు. అనంతగిరి మండలానికి చెందిన కూలీలు ట్రాక్టర్‌లో రాతి స్తంభాలు తీసుకెళ్తుండగా ద్విచక్రవాహనదారులతో వాగ్వాదం చోటుచేసుకుని దాడికి దారితీసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు. నిందితులకు గంజాయి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి పాజిటివ్ రిపోర్టు రాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.