చెక్ బౌన్స్ కేసు లో నిందితుడికి జైలు శిక్ష

కోదాడ కోర్టు బుధవారం చెక్‌బౌన్స్ కేసులో నిందితుడు ఎలగందుల శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016లో కర్నాటి అశోక్ వద్ద రూ. 11 లక్షలు అప్పుగా తీసుకున్న శ్రీనివాసరావు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. విచారణలో నేరం రుజువు కావడంతో, శ్రీనివాసరావుకు జైలు శిక్షతో పాటు రూ. 11 లక్షలు చెల్లించాలని, నెల రోజుల్లో చెల్లించకపోతే అదనంగా మరో నెల జైలు శిక్ష పడుతుందని కోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్