డిప్యూటీ సీఎం పర్యటనలో నిర్లక్ష్యం.. ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు

సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు, నిర్ణయించిన మార్గానికి బదులుగా వేరే మార్గంలో తీసుకెళ్లిన ఘటనపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జోనల్-2 ఐజీ, సూర్యాపేట ఎస్పీ నుంచి వివరణ కోరిన అనంతరం, పోలీసు ఉన్నతాధికారులు ఖమ్మంలో డిప్యూటీ సీఎంను కలిసి పూర్తి వివరాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఎస్ఐ గోపాల్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్