కోదాడ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి నూతనంగా 105 మంది విద్యార్థులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంఈఓ ఎండి. సలీం షరీఫ్ మాట్లాడుతూ, గత ఏడాది ఎస్‌ఎస్‌సీ ఫలితాలు, నాణ్యమైన బోధన, డిజిటల్ విద్య, క్రమశిక్షణ, మెరుగైన వసతుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగి అడ్మిషన్లు అధికమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఈ. శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.