చేయూత పింఛన్లు పెంచేంతవరకు వికలాంగుల ఉద్యమం ఆగదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. శని వారం అనంతగిరి మండలం వాయిల సింగారంలో వికలాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల14 సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి గడ్డం ఖాసిం, ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు ఉన్నారు.