కోదాడలో అన్నప్రసాద వితరణ: 240 మందికి భోజనం

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో పితృ మహాలయ పక్షాల సందర్భంగా కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మూడో రోజు బుధవారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. బత్తుల లింగయ్య, బత్తుల లింగమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 240 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. డాక్టర్ రామారావు, పైడిమర్రి వెంకటనారాయణ, అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕