జెర్రిపోతుల గూడెం ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం

చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ నరసింహారెడ్డి, ఉపాధ్యాయుల అంకితభావాన్ని, పాఠశాల తీరుతెన్నులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ వేడుకలు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి దోహదపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్