దరఖాస్తులు మాయం.. లబ్ధిదారుల అయోమయం !

కుల, ఆదాయ, నూతన రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తు ఫారాలు జీపీవో, ఆర్ఐల పరిశీలన వరకు మాత్రమే కనిపిస్తున్నాయని, ఆ తర్వాత అవి కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు ధృవకుమార్ ను వివరణ కోరగా, దరఖాస్తులు దొరకని విషయం తన దృష్టికి రాలేదని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్