తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆవుల

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉద్యమకారుడు ఆవుల రామారావు శుక్రవారం నియమితులయ్యారు. కోదాడ పబ్లిక్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు, జైలు జీవితం గడిపిన వారికి ఫోరం అండగా ఉంటుందని తెలిపారు. ఆవుల రామారావు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తుపాకుల భాస్కర్, ఏనుగుల ఏలేశ్వరావు, మట్టపల్లి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్