బాలాజీ నగర్ 7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ ప్రచారం

కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం అవార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను హనుమానాయక్ కు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు. అదేవిధంగా పట్టణంలోని 26వ వార్డు అభ్యర్థి కుక్కడపు సువర్ణాదేవి, వెంకటేశ్వర్లు గెలుపును కోరుతూ వార్డులో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేమమే విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కారు గుర్తుకు ఓటు వేసి హనుమానాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్