మత సామరస్యానికి ప్రతీకగా బషీర్ భాయ్

కోదాడలోని గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో, కోదాడ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బషీర్ భాయ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామీశెట్టి రామకృష్ణలతో కలిసి అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్ భాయ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 71 రోజుల పాటు అన్నదానం చేస్తున్న శ్రీనివాస్ నాయుడు ఆధ్యాత్మికతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారాం సింగ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్