కిషోర్ బాలికలకు సైకిల్ శిక్షణ కార్యక్రమం...

కోదాడ మండల పరిధిలోని సంఘాల సభ్యుల పిల్లల కోసం శనివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కిషోర్ బాలికల సంఘాల ఆధ్వర్యంలో సైకిల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం వెంకన్న మాట్లాడుతూ, గ్రామాల్లోని 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఉచితంగా సైకిల్ శిక్షణ అందించి, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలికలను స్నేహ సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీసీ పరిమళ, వివోఏలు, గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్