విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య పాల్గొని, బస్టాండ్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ శాంతి మార్గం, శాస్త్రి ఆశయాలు సదా ఆచరణీయమని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕