హుజూర్‌నగర్ లో బీజేపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ

హుజూర్‌నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో సాధించిన భారీ విజయాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలకు ఇది గట్టి హెచ్చరిక అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్