జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు కి బిజెపి ఘన సన్మానం

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన పెరుమాళ్ళ రామారావుకు కోదాడ మండల బీజేపీ అధ్యక్షుడు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలో సోమవారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదని, విద్యార్థుల జీవితాలను నిర్దేశించి మార్గదర్శకుడిగా నిలుస్తారని ప్రశంసించారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ నిర్మాణంలో పెరుమాళ్ళ రామారావు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణయ్య, వెలువలు చిట్టయ్య, కట్ట గోజు నాగేంద్ర చారి, ఎర్రగని రాధాకృష్ణ, భూమా శ్రీనివాస్, వంగాల పిచ్చయ్య, మాధవరెడ్డి, ఏపూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕