నడిగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుక్రవారం అల్పాహారం పంపిణీ చేశారు. నడిగూడెం గ్రామానికి చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, హెడ్ కానిస్టేబుల్ షేక్ ఇసాక్ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని, విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. శిబిరంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు షేక్ ఇసాక్ సేవాభావాన్ని అభినందించారు. కార్యక్రమంలో కోచ్‌లు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.