రేపు కోదాడలో బీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన

కోదాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జూన్ 14న ఉదయం 10 గంటలకు కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురంలో ఉన్న ARAR ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంచార్జ్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, కోదాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంచార్జ్ తిప్పన విజయసింహారెడ్డి, కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరుకానున్నారు. నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్