వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది

వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గి, పర్యావరణ కాలుష్యం పెరిగి రైతులకు నష్టం జరుగుతుందని వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. గణపవరం గ్రామంలో సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, వరికొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. భూసారాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరశెట్టి కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జీవిత రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్