స్వర్ణ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో మజ్జిగ పంపిణీ

కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద స్వర్ణ భారతీ చారిటబుల్ ట్రస్ట్ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రమ శక్తి అవార్డు అందుకుంటున్న కోదాడ పట్టణ ఆవోపా అధ్యక్షులు కంది బండ వెంకటేశ్వరరావుకు గౌరవ సూచకంగా ఈ కార్యక్రమాన్ని వారి మిత్రులు యాద సుధాకర్, కొండ్లే రవికుమార్, శ్రీనివాస నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇమ్మడి రమేష్, గరిణే ఉమా, గరిణే శ్రీధర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్