ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిపై నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద అతివేగంతో, అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న నేలకొండపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.