కోదాడలో నడి రోడ్డుపై కారు బోల్తా

కోదాడలో సూర్యాపేట రోడ్డులోని జూడియో వద్ద శనివారం నడి రోడ్డుపై ఒక కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, పిల్లలు ఆడుకునే కారు తలకిందులైనట్లుగా కారు బోల్తా కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నడి రోడ్డుపై కారు బోల్తా కొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్