పశువుల్లో సోకే గురక అంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమం

కోదాడ పట్టణంలో తొలకరి వర్షాల నేపథ్యంలో పశువుల్లో సోకే గురక అంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ప్రారంభించారు. వర్షాల తర్వాత మొలిచే గడ్డితో పాటు మట్టిలోని బాక్టీరియా పశువుల కడుపులోకి చేరి గురక వ్యాధికి కారణమవుతుందని, అధిక జ్వరం, పొట్ట ఉబ్బరం, గొంతు వాపు, శ్వాస సమస్యలు ఏర్పడి ప్రాణాపాయం కలుగుతుందని ఆయన తెలిపారు. పశుపోషకులు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించి పశువుల ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. సురేంద్రతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్