జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చందా శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడిగా చందా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, పూర్వ అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం తెలిపారు. చందా శ్రీనివాసరావు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా తొలి అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జన విజ్ఞాన వేదిక అభివృద్ధికి కృషి చేశారు. ఈ నియామకం సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕